మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో గుర్రంపై స్వారీ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా మరణించాడు. పెళ్లి మండపం దుఃఖంగా మారింది. వధూవరుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వధువు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రం, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుడి మరణానికి కారణం సైలెంట్ హార్ట్ ఎటాక్ అని వైద్యుల ప్రాథమిక అంచనా. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: Haryana: గ్రేట్.. పుల్వామా దాడిలో అమరుడైన జవాన్ కుమారుడు.. అండర్-19 జట్టుకు ఎంపిక
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ నగరం జాట్ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి వివాహ వేడుక జరుగుతోంది. వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహ ఊరేగింపు చాలా వైభవంగా నిర్వహించారు. వరుడు ప్రదీప్ జాట్ గుర్రంపై స్వారీ చేస్తూ సంతోషంగా వేదిక వైపు కదులుతున్నాడు. ఇంతలో అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. ఏమి జరుగుతుందో అక్కడున్నవారెవరికీ అర్థం కాలేదు. అతన్ని గుర్రంపై నుంచి కిందకు దించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వరుడు ప్రదీప్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. వరుడి మరణానికి నిశ్శబ్ద గుండెపోటు అని వైద్యులు తెలిపారు. కానీ అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా మాత్రమే తెలుస్తుంది.
READ MORE: Chandoo Mondeti: అల్లు అర్జున్ సిగ్నేచర్ కోసం ‘తండేల్’ కథ..గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది!
घोड़ी चढ़कर बारात लेकर पहुंचा दूल्हा, डीजे पर नाचने के बाद वापस घोड़ी पर बैठकर जाते समय हुई हालत गंभीर, थोड़ी देर बाद ही रुक गई सांस हुई मौत, खुशियां माता में बदली #heartattack #heart pic.twitter.com/evAmHLJuqa
— DINESH SHARMA (@medineshsharma) February 15, 2025