AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!
- నేటి నుంచి శాసనమండలి సమావేశాలు
- ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలు
- లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమయ్యారు.
ఇవాళ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు వివరణ కోరనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులపై నమోదవుతున్న అక్రమ కేసుల అంశం కూడా చర్చకు రానుంది. అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల బదిలీల సమస్యలు, వడ్డెర-రజక-పల్లెకార సామాజిక వర్గాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశాలపై కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమ చర్యలు, జిల్లా న్యాయస్థానాల్లో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదుల నియామకం వంటి అంశాలు కూడా సభలో ప్రస్తావనకు రానున్నాయి.
Also Read
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ, పరిశ్రమలకు తాటిపూడి జలాశయం నుంచి నీటి సరఫరా, చిన్న మరియు మధ్య తరహా సాగునీటి చెరువుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాలు కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇవాళ కూడా లడ్డూ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో శాసనమండలిలో హాట్ హాట్ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..