Boondi Laddoo: “బూందీ లడ్డూ”తో పరారీలో ఉన్న హత్య దోషి అరెస్ట్..
- బూందీ లడ్డూతో చిక్కిన హత్య నేరం దోషి..
- 4 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
Read Also: Wife harassment: భార్య వేధింపులకు మరో భర్త బలి.. ‘‘వరకట్న చట్టాలను మార్చాలంటూ..’’
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
హత్య నేరం కింద దోషిగా తేలిని కైలాష్ 2011లో 3 నెలల పెరోల్ కింద విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పారిపోతున్నాడు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో అరెస్ట్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 3 నెలల పెరోల్ తర్వాత లొంగిపోకుండా 2021 నుంచి పరారీలో ఉన్నట్లు ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మకాం మార్చాడు.
మొదట్లో ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో నివసించేవాడు. ఆ తర్వాత రెండేళ్లు హరిద్వార్‌కి మకాం మార్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరు వచ్చి రోజూవారీ కూలీగా పనిచేస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. అయితే, ఎలాంటి అనుమానం వచ్చినా మళ్లీ పారిపోతాడని తెలిసి, అధికారులు గణతంత్ర దినోత్సవం రోజు గ్రామస్తులతో కలిసి ‘‘బూందీ లడ్డూలు’’ పంపిణీ చేశారు. అదే సమయంలో తెలివిగా కైలాష్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలు అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!