Borewell Incident: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన 10 ఏళ్ల బాలుడు మరణించాడు. 16 గంటల పాటు అధికారుల చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. గంటలు శ్రమించిన అధికారులు బాలుడిని బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు సుమిత్ మీనా మరణించినట్లు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు.
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్‌కు ముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై 'ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది.
Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు…
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే చంపాడు ఓ విద్యార్థి. ఛతర్‌పుర్ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేనా (55) ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
IPS officer: ఎంతో కష్టపడి సివిల్స్ క్లియర్ చేశాడు, ఎన్నో ఆశలతో పోస్టింగ్‌లో చేరేందుకు వెళ్తున్న యువ ఐపీఎస్ అధికారి విగతజీవిగా మారాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.