మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మతపరమైన పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, ఇతర మతపరమైన నగరాల పరిమితుల్లో మద్యం అమ్మకాలు నిషేధించనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. నలుగురు పిల్లలను కనాలని నిర్ణయించుకున్న బ్రాహ్మణ యువ జంటలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ ఛైర్మన్ పండిట్ విష్ణు రాజోరియా రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. పండిట్ విష్ణు రాజోరియా పరశురామ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ ప్రభుత్వ హయాంలో నడుస్తోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
IT Raids: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో అధికారులకు షాక్ తగిగిలింది. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఆ ఇంట్లో మూడు మొసళ్లను కూడా వారు గుర్తించారు.
Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విష వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో భోపాల్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక వాడకు తరలిస్తున్నారు.
Borewell Incident: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన 10 ఏళ్ల బాలుడు మరణించాడు. 16 గంటల పాటు అధికారుల చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. గంటలు శ్రమించిన అధికారులు బాలుడిని బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు సుమిత్ మీనా మరణించినట్లు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు.
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
క్రైస్తవుల అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్కు ముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చర్చిలను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఓ చర్చిపై 'ఆలయం'(మందిర్) అని రాశారు. దీనికి హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త వివాదం తలెత్తింది.