1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MacBook Pro 2026 Launch: ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడళ్లను భారతదేశంలో లాంచ్ చేసింది. 2026 అప్డేట్ లో భాగంగా.. కంపెనీ 14, 16 అంగుళాల వేరియంట్స్ లో M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు M5 ప్రో (M5 Pro) మరియు M5 మ్యాక్స్ (M5 Max) చిప్ లతో పనిచేస్తాయి. వీటివల్ల ఇవి ముందటి మోడళ్ల కంటే అత్యంత వేగంగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా AI పనులను వేగవంతం చేయడానికి వీటిలో ప్రత్యేకమైన ‘ఫ్యూజన్ ఆర్కిటెక్చర్’ను ఉపయోగించారు.
Laureus World Team of the Year: భారత మహిళల జట్టు సంచలనం.. ఆ గ్లోబల్ అవార్డ్కు నామినేషన్..!
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ఇంకా వీటిలో లిక్విడ్ రెటినా XDR డిస్‌ప్లేను ఉపయోగించారు. ఇది 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వీడియో కాల్స్ కోసం 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను అమర్చారు. ఇది మీరు కదులుతున్నా మిమ్మల్ని ఫ్రేమ్ మధ్యలో ఉంచుతుంది. మొట్టమొదటిసారిగా ఈ ల్యాప్‌టాప్‌లలో థండర్‌బోల్ట్ 5 (Thunderbolt 5) పోర్ట్‌లను అందించారు. ఇవి డేటా బదిలీని అత్యంత వేగంగా చేస్తాయి. WI-FI 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 24 గంటల వరకు పని చేస్తుందని ఆపిల్ పేర్కొంది.
Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

బేస్ మోడల్ ఇప్పుడు 1TB స్టోరేజ్ నుండి ప్రారంభమవుతుంది. M5 ప్రో మోడల్ 64GB వరకు, M5 మ్యాక్స్ మోడల్ 128GB వరకు యూనిఫైడ్ మెమరీని సపోర్ట్ చేస్తాయి. కొత్త మ్యాక్‌బుక్ ప్రో ధరలు వేరియంట్‌ను బట్టి ఇలా ఉన్నాయి:
* 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (M5 Pro): ప్రారంభ ధర రూ. 2,49,900.
* 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (M5 Pro): ప్రారంభ ధర రూ. 2,99,900.
* 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (M5 Max): ప్రారంభ ధర రూ. 4,29,900.
ఈ కొత్త మోడళ్ల ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 11 నుండి ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్, అధీకృత రిటైలర్ల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్లు, డెవలపర్లు, క్రియేటర్లకు ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రో ఒక గొప్ప ఎంపికగా నిలవనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!