Shocking Video: అత్తగారిపై అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ కోడలు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ, మహిళ తరుపు బంధువులు భర్తపై, ఆమె తల్లిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. వృద్ధురాలు అని చూడకుండా కోడలు, తన అత్తని జట్టు పట్టి లాగి దాడి చేసింది. తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించినందుకు కోడలు ఈ దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఏప్రిల్ 4న…
వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు పాకింది. కునాల్ కమ్రాకు సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ టాయిలెట్ వెలుపల ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే.. ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తామంటూ యువసేన అధ్యక్షుడు అనురాగ్ సోనార్ హెచ్చరించారు. శివసేన యువజన విభాగం కార్యకర్తలు.. కునాల్ కమ్రాను హెచ్చరిస్తూ నగరంలో పోస్టర్లు వేశారు.
Husband Suicide: భార్య, భార్య తరుపు బంధువల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ వ్యవహారం కూడా ఈ కోవకు చెందినదే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఇది జరిగిన తర్వాత, మరికొందరు కూడా తమ భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
మధ్యప్రదేశ్‌లో సినిమా తరహాలో ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 2023లో హత్యకు గురైనట్లు భావించిన మహిళ.. తాజాగా సజీవంగా ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను పట్టుకుని జైల్లో వేశారు. వీళ్లంతా రెండేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నారు. తాజాగా హతురాలు అనబడిన ఆమె ప్రత్యక్షం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో గిరిజనుల మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేసింది. ఈ సంఘటనలో వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఏఎస్ఐ కూడా మరణించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. హింసకు సంబంధించి ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ మరణించగా, ఇతర పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని రేవా డీఐజీ సాకేత్ పాండే తెలిపారు. Read Also: Pakistan: పాక్ ఆర్మీని…
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
MP: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ టీమ్ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది, ఘర్షకు కారణమైంది. దీంతో హింస చెలరేగింది. Read Also: Parliamentary Panel: రోహింగ్యా, బంగ్లాదేశీలను భారత్ నుంచి పంపించాలి.. అయితే,…
దేశ వ్యాప్తంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిచినందుకు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మోహోలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి విజయోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేసి బైకులు, కార్లను తగలబెట్టారు.