మధ్యప్రదేశ్‌లోని రేవాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సమోసాలో బల్లి కనిపించడంతో ఇక్కడ కలకలం రేగింది. దీంతో ఐదేళ్ల చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. నిజానికి.. సమోసా తిన్న తర్వాత రేవాలోని 5 ఏళ్ల చిన్నారికి వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారి కుటుంబం హోటల్ యజమానిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగియగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనగసాగుతున్నారు. ట్రెండ్స్‌లో మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చారు. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ప్రతి ఒక్కరూ…
Murder Mystery: ఎలాంటి ఆధారాలు లేని ఒక హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులకు ‘‘ఈగలు’’ సాయపడ్డాయి. తన మామని చంపిన కేసులో 19 ఏళ్ల యువకుడిని పట్టించాయి. చివరకు ఈగల వల్ల యువకుడు తాను చేసిన హత్యా నేరాన్ని ఒప్పుకున్నాడు. సరైన సాక్ష్యాధారాలు లేకున్నా పోలీసులు ఈ కేసును ఛేదించారు.
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Unique Tradition: దీపాల పండుగ దీపావళిని భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దీపావళి తర్వాత రెండవ రోజున గోవర్ధన్ పూజ జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర్ నగరం ఉజ్జయిని నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నగర్ తహసీల్‌లోని భిదావద్ గ్రామంలో గోవర్ధన్ పూజలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం అనుసరించబడుతుంది. నేలపై పడుకున్న వ్యక్తులపైకి ఆవులు నడుస్తాయి. విశిష్టమైన సంప్రదాయాన్ని చూసేందుకు జనం పెద్దెత్తున చేరుకుంటారు. ఎవరైనా ప్రజలు వారు అనుకున్న కోరికలు నెరవేరడం లేదా కోరిక…
Fire In Train: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో ఆదివారం నాడు ప్రయాణికులతో వెళ్తున్న డీఈఎంయూ రైలు ఇంజిన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఓ రైల్వే అధికారి ఒకరు విషయాన్ని వెల్లడించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారి తెలిపారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉండడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్) నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ రైలు ఇంజిన్‌లో సాయంత్రం 5.30…
Police Patrol Bike: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పోలీస్ పోస్ట్ వద్ద పార్క్ చేసిన పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ను దొంగలు అపహరించారు. అక్టోబరు 15న పట్టపగలు ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే, ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ కేసులో గుర్తు తెలియని దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also:…
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్‌లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
Crime: ఆర్మీ జవాన్‌గా నటించిన ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. ఫేస్బుక్లో యువతితో స్నేహాన్ని పెంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కపిలేష్ శర్మ 2023లో ఫేస్బుక్లో ఆర్మీ జవాన్‌గా కలరింగ్ ఇచ్చి, మహిళతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్ పెట్టుకున్నారు.
ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్‌నే బుక్ చేస్తున్నారు.