Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Tata Sierra EV: టాటా లవర్స్‌కి గుడ్‌న్యూస్.. కొత్త ఈవీ కార్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అదుర్స్!
ఆలయంలోని అన్నక్షేత్రంలో ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) లక్ష్మీ నారాయణ్ గార్గ్ విలేకరులకు తెలిపారు. బాధితురాలిని రజనీ ఖత్రీగా గుర్తించారు. ఆ సమయంలో ఆమె వంటగదిలో పనిచేస్తోందని, ఆమె దుపట్టా మిషన్‌లో చిక్కుకుందని ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ ఉద్యోగులు చెప్పారు. బాధితురాలని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని అధికారులు తెలిపారు. అన్నక్షేత్రం మహాకాళేశ్వర ఆలయం నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులకు అన్నదానం చేస్తుంటారు.