Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 377 టన్నుల విష వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో భోపాల్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక వాడకు తరలిస్తున్నారు. వాటిని తీసుకెళ్తున్న 12 కంటైనర్ ట్రక్కులు రాత్రి 9 గంటల ప్రాంతంలో వాటి ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి.. వీటి కోసం గ్రీన్ కారిడార్‌ను రూపొందించారు. ఈ ప్రయాణానికి సుమారు7 గంటల సమయం పడుతుందని సమాచారం. దాదాపు 100 మంది కార్మికులు 30 నిమిషాల షిఫ్టుల్లో వ్యర్థాలను ప్యాక్ చేసి ట్రక్కుల్లోకి ఎక్కించేశారు.
Read Also: DD 4 : ధనుష్ దర్శకత్వంలో ‘ఇడ్లీ – కడాయ్’.. ఫస్ట్ లుక్ రిలీజ్
ఇక, గత ఆదివారం నుంచి వీటిని ప్యాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, ప్రతి 30 నిమిషాలకు రెస్ట్ ఇచ్చారు. ట్రక్కులు విష వ్యర్థాలతో ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే, 3 నెలల్లో ఆ వ్యర్థాలను పూర్తిగా కాల్చివేస్తామని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ వెల్లడించారు. ఏదైనా ఆటంకం కలిగితే, ఈ పనికి తొమ్మిది నెలల వరకు టైం పట్టవచ్చన్నారు. మొదట్లో పితంపూర్‌లోని వ్యర్థ పదార్థాల యూనిట్‌లో కొంత వ్యర్థాలను కాల్చి వేయనున్నారు.
Read Also: Anand Devarakonda : ‘బేబి’ కాంబోలో మరో సినిమా.. దర్శకుడు ఎవరంటే..?
ఇక, కాల్చిన తర్వాత ఆ వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం ఇంకా మిగిలి ఉందా లేదా అని తెలుసుకోవడానికి పరిశీలిస్తామని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించిన తర్వాత ఆ బూడిదను మట్టి, నీటితో సంబంధంలోకి రాకుండా పాతిపెడతామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల టీమ్ ఈ ప్రక్రియను చేపట్టనుందన్నారు. 2015లో పీతాంపూర్‌లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేశాం.. దాని వల్ల సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయని కొందరు స్థానికులు చెప్పారు. కానీ, వారి వాదనను భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ తోసిపుచ్చారు. 2015 పరీక్ష నివేదిక, అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే పితాంపూర్ దగ్గర వ్యర్థాలను పారవేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, 1.75 లక్షల జనాభా ఉన్న పితాంపూర్‌లో వ్యర్థాలను పారవేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.