Borewell Incident: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన 10 ఏళ్ల బాలుడు మరణించాడు. 16 గంటల పాటు అధికారుల చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. గంటలు శ్రమించిన అధికారులు బాలుడిని బయటకు తీసుకువచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడు సుమిత్ మీనా మరణించినట్లు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు.
మధ్యప్రదేశ్ గుణా జిల్లాలోని రఘోఘర్‌లోని జంజలి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 3.3. గంటలకు బాలుడు బోరుబావిలో పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బోరు బావి నుంచి బాలుడిని బయటకు తీశారు.బాలుడు 39 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు.
Read Also: Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకి ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’
బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ 40 అడుగుల వరకు సమాంతరంగా గొయ్యిని తవ్వాయి. పిల్లాడి ఆక్సిజన్ కూడా అందించారు. ఘటన స్థలంలోనే వైద్యుల బృందాలను మోహరించారు. 16 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ ద్వారా బాలుడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే బాలుడు మరణించాడు.
‘‘రాత్రంతా చల్లటి వాతావరణంలో పిల్లవాడు ఇరుకైన బోర్‌వెల్‌లో ఉన్నాడు. అతడి చేతులు కాళ్లు తడిసి వాచిపోయాయి. అతని బట్టు కూడా తడిసిపోయాయి. నోటిలో బురద కనిపించింది. హైపోథెర్మియా (బాడీ టెంపరేచర్ 95 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువగా పడిపోయినప్పుడు ఏర్పడే పరిస్థితి) కారణంగా శరీర భాగాలు స్తంభించిపోయాయి’’ అని గుణ జిల్లా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజ్‌కుమార్ రిషీశ్వర్ చెప్పారు.
మరోవైపు దేశవ్యాప్తంగా రాజస్థాన్ కోట్‌పుట్లీ బోరుబావి ఘటన సంచలనంగా మారింది. 3 ఏళ్ల చేత్నా అనే బాలిక ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. వారం రోజులుగా బాలికను రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాలిక ప్రాణాలతో బయటకు రావాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు.