Live-In Partner: లివ్-ఇన్‌లో ఉన్న మహిళని చంపేసిన వ్యక్తి.. 8 నెలలుగా ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ..
- అద్దె ఇంట్లోని ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం..
- గతేడాది హత్యకు గురైనట్లు అనుమానం..
- విద్యుత్ సరఫరా నిలిపేయడంతో దుర్వాసన..
- దీంతో వెలుగులోకి వచ్చిన హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలో ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఈ కేసులు గతంలో ఈ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పాటిదార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు ధరించి, చేతులు మెడను కట్టి ఉంచిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. మహిళ గత సంవత్సరం హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మహిళని పింకీ ప్రజాపతిగా గుర్తించారు.
పింకీ జూన్ 2024లో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత 8 నెలలుగా మృతదేహాన్ని ఫ్రిజ్‌లోనే ఉంచాడు నిందితుడు. దుర్వాసన రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వారు ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో, ఇంట్లోకి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రిజ్‌లోని మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
Read Also: Bihar Scam: ‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..
ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్‌లో నివసిస్తున్నాడు. శ్రీవాస్తవ ఈ ఇంటిని జూన్ 2023లో ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్‌కి అద్దె ఇచ్చారు. పాటిదార్ 5 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరు భార్యభర్తలమని చెప్పి ఇరుగుపొరుగు వారిని నమ్మించారు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే పాటిదార్ తన స్నేహితుడి సాయంతో పింకీని చంపేసినట్లు తెలుస్తోంది. పాటిదార్‌కి అప్పటికే వివాహం అయింది.
ఇల్లు అద్దెకు తీసుకున్న ఒక ఏడాది తర్వాత పాటిదార్ ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే, తన సామన్లను మాత్రం స్టడీరూమ్, మాస్టర్ బెడ్‌రూంలో ఉంచడం కొనసాగించాడు. త్వరలోనే ఖాళీ చేస్తానని చెప్పినట్లు ఓనర్ శ్రీవాస్తవకు చెప్పాడు. పాటిదార్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని, ప్రస్తుతం ఇంటిలో ఉంటున్న అద్దెదారుడు ఇంట్లోని ఒక పోర్షన్‌ని తెరవాలని ఇంటి యజమానిని అడిగాడు. ఇంటి యజమాని ఇంటిలోని ఈ భాగాన్ని అద్దెదారుడికి చూపించాడు. కానీ పాటిదార్ వస్తువులు లోపల ఉండటంతో మళ్లీ అన్‌లాక్ చేశాడు. బుధవారం విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఫ్రిజ్‌లో ఉన్న మహిళ మృతదేహం నుంచి కుళ్లిపోయిన వాసన రావడం ప్రారంభమైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పాటిదార్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!