Solar Power Plants: ఆంధ్రప్రదేశ్‌లో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పార్కులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్రమే ప్రకటించింది.. ఇవాళ లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. ఏపీలో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పవర్ ప్లాంట్లకు ఆమోదం…
అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. స్పీకర్ పోడియంను BRS ఎంపీలు చుట్టుముట్టారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్టీ రిజర్వేషన్లపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఆ దిశగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా… పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు.. తెలంగాణలో 10 శాతం బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా? అంటూ లోక్‌సభలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్ రెడ్డి, కవిత మాలోతు.. కేంద్రాన్ని ప్రశ్నించారు.. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కి 10 శాతానికి పెంచిన…
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలకు సంబంధించి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943, రక్షణ శాఖలో 2,64,704 మంది, హోం వ్యవహారాల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
విద్యుత్ చట్టసవరణ బిల్లు 2022ను లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్... ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష పార్టీలు.. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం చేతిలోకి తీసుకుంటున్నారని ఆందోళన చేశారు.. విపక్షాల ఆందోళనతో బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సిఫారసు చేశారు..
Two-Wheelers And Four-Wheelers In India: దేశంలో టూవీలర్లు, ఫోర్ వీలర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ముక్యంగా ద్విచక్ర వాహనాలు దాదాపుగా ఒక్కో కుటుంబానికి ఒకటి ఉంటోంది. ఇదిలా ఉంటే దేశంలో మొత్తం రిజిస్టర్ అయిన టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల వివరాలను వెల్లడించారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పార్లమెంట్ సభ్యులు అడిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ వాహనాల వివరాలను వెల్లడించారు. దేశంలో ఆగస్టు 3,…
సాయుధ దళాలలో 84,659 ఖాళీలు ఉన్నాయని.. డిసెంబర్ 2023 నాటికి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) మరియు అస్సాం రైఫిల్స్‌లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలియజేసింది.