NEET: ఏడాదికి రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ని నిర్వహించేలా జాతీయవైద్య కమిషన్(ఎన్ఎంసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవన్ పవార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏం లేదని ఆమె లోక్ సభకు తెలియజేశారు. నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఆలోచన లేదని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం లోక్ సభకు తెలిపింది.
Read Also: Bandi Sanjay : మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్ మాదిరిగానే నీట్ ను రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందా..? ఈ పరీక్షలను సింగిల్ విండో ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందా.? అని బీజేపీకి చెందిన ఎంపీ రమేష్ చంద్ బింధ్ అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. దేశంలోని అత్యుత్తమ వైద్య సంస్థల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు నీట్ అవకాశం కల్పిస్తోందని మంత్రి అన్నారు. ఇది మెడికల్ అడ్మిషన్లలో అవకతవకలను అరికట్టడంతో పాటు పారదర్శకతను పెంచుతోందని ఆమె అన్నారు.