కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి.
లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్‌సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం..…
ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణపర్వం కొనసాగుతూనే ఉంది… రాష్ట్రాలను కేంద్రం తప్పుబడుతుంటే.. తప్పంతా కేంద్రానిదే అంటున్నాయి తెలంగాణ సహా పలు రాష్ట్రాలు.. అయితే, ఈ నేపథ్యంలో బాయిల్డ్ రైస్‌పై మరోసారి తన విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని లోక్‌సభలో స్పష్టం చేసింది కేంద్రం.. ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి…
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం సాగుతోంది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇక, వివిధ రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు…
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన పెద్ద రచ్చగా మారింది.. అర్వింద్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని, దాడికి తెగబడ్డాయి.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేసి ఆరా తీశారు.. ఆర్మూర్‌లో టీఆర్ఎస్…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి.. ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి.. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాల పాటు సభా సమయం వృథా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా…
బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీయే ఉంటుంది.. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ) ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు… ప్రభుత్త గణాంకాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ నాటికి దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్..…
తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్‌సభలో ఈరోజు జీరో అవర్‌లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం…