పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో తరచూ వాయిదాలు, ఆందోళనలతో ఉభయ సభలు అనుకున్న సమయం కంటే తక్కువ నడిచాయి. రోజువారీ అంతరాయాలు, తరచుగా వాయిదాల కారణంగా లోక్‌సభ ఈ బడ్జెట్ సెషన్ షెడ్యూల్ చేయబడిన 133.6 గంటలకు సమయానికి బదులుగా కేవలం 45 గంటలు మాత్రమే పని చేసింది. అదే సెషన్‌లో రాజ్యసభ 130 గంటలకు 31 గంటలు మాత్రమే సభ నడిచింది. ఈ మేరకు PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ డేటా వెల్లడించింది. లోక్‌సభలో మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టగా.. ఆరు ఆమోదం చెందాయి.
Also Read:Japanese military helicopter: జపాన్ సైనిక హెలికాప్టర్ అదృశ్యం.. వారంతా క్షేమమేనా?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31, 2023 నుండి ఏప్రిల్ 6, 2023 వరకు కొనసాగాయి. ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు విరామం ఇచ్చారు. లోక్‌సభ 34.28 శాతం పనిచేయగా.. రాజ్యసభ కేవలం 24 శాతానికే పరిమితమైంది. శాసనసభ వ్యవహారాలు లోక్‌సభలో గంట కంటే తక్కువ సమయం పట్టగా, రాజ్యసభలో కేవలం రెండు నిమిషాలు మాత్రమే పట్టింది. ఆర్థిక వ్యవహారాలకు లోక్‌సభలో 17.25 గంటలు, రాజ్యసభలో 18.23 గంటలు పట్టింది. ఉభయ సభలు సమావేశమంతా ప్రశ్నోత్తరాల సమయం పదే పదే వాయిదా పడింది. లోక్‌సభలో క్వశ్చ్యన్ అవర్ 4.32 గంటలు నడవగా.. రాజ్యసభలో కేవలం 1.85 గంటలే కొనసాగింది.
Also Read:Shaakuntalam: సమంత హిట్ కొట్టేసినట్లే.. ఎందుకంటే ?
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తన ముగింపులో మాట్లాడుతూ, సాధారణ బడ్జెట్‌పై సభలో 14.45 గంటలపాటు చర్చలు జరిగాయని, 145 మంది ఎంపీలు అందులో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలు 13.44 గంటల పాటు 143 మంది ఎంపీల భాగస్వామ్యంతో జరిగాయి. లోక్‌సభలో ఎనిమిది ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టగా, ఆరింటికి ఆమోదం లభించిందని, 29 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానమిచ్చామని బిర్లా చెప్పారు. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయబడింది.58 రోజులు సమావేశాలు ఉండడంతో 17వ లోక్‌సభ 331 రోజుల కంటే ఎక్కువసేపు జరిగే అవకాశం లేదు. 1952 తర్వాత ఇది ఆరవ అతి తక్కువ బడ్జెట్ సెషన్.