లోకసభలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ…
పెట్రోల్, డీజిల్ ధరలు.. రోజురోజుకీ సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, జీఎస్టీ కౌన్సిల్ సమవేశం జరిగిన ప్రతీసారి.. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కానీ, ఆ ఉద్దేశమే లేదనేది తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.. ఎందుకుంటే.. ఆ దిశగా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ..…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి.. ఆ చట్టంలోని మెజార్టీ అంశాలు అమలుకు నోచుకోలేదని రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.. “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం” అమలు గురించి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రశ్నించారు.. విభజనచట్టంలో పొందుపరచిన అంశాలు అన్నీ నెరవేర్చారా? లేదా? లేకపోతే అమలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
పార్లమెంట్ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉభయసభలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో రేపు సమావేశం కానున్నారు. లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారని తెలుస్తోంది.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.. అదేవిధంగా దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు జారీ చేసింది లోక్సభ సచివాలయం… ఆయనతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్లకు కూడా నోటీజులు జారీ అయ్యాయి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అందిన ఫిర్యాదులపై స్పందించిన లోక్సభ సచివాలయం… ఆ ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. లోక్సభ స్పీకర్ను కలవడం…
రాహుల్ గాంధీ.. త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్యతలను ప్రస్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.. ఇక, ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయినట్టు…
వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేవాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ.. కాగా, కరోనా మహమ్మారి విజృంభణతో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ పూర్తిస్థాయిలో నిర్వహించిలేదు.. పార్లమెంట్ సిబ్బంది, ఎంపీలు చాలా మంది కోవిడ్ బారినపడడంతో.. అర్థాతంగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై విమర్శలు చేశాయి…