లోక్సభలో అధికార, విపక్షాలు వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్సభకు రానని స్పష్టం చేశారు.
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో తరచూ వాయిదాలు, ఆందోళనలతో ఉభయ సభలు అనుకున్న సమయం కంటే తక్కువ నడిచాయి.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సోమవారం లోక్సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చర్చించేందుకు ఈ సభ జీరో అవర్లో అవకాశం ఇవ్వాలని నోటీసులో కోరారు.