Kiren Rijiju: లోక్‌సభలో భారత రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఉన్న ముస్లింలతో పోలిస్తే, భారత్‌లోని ముస్లింలు చాలా బెటర్‌గా ఉన్నారని కొనియాడారు. అందుకే పొరుగు దేశాల్లో ఉంటున్న మైనార్టీలు కూడా ఆశ్రయం కోరుతున్నారని కిరణ్ రిజిజు వెల్లడించారు.
Read Also: Perni Nani Family in Hiding: అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు..!
అయితే, ఇతర దేశాల్లో మైనార్టీలకు కల్పిస్తున్న ఓటింగ్ హక్కుల గురించి కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. అలాగే, మన దేశంలో తమ హక్కులను కాపాడుకునేందుకు మైనార్టీలకు న్యాయ రక్షణ కల్పిస్తోందన్నారు. ఇక, దేశం గురించి మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశం యొక్క ఇమేజ్‌పై అది ప్రభావం చూపంచే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య రంగంలో భారత్‌తో ఏ దేశాన్ని కూడా పోల్చొద్దన్నారు. దీంతో పాటు దేశ ఆర్థిక ప్రగతిలో చాలా గ్యాప్‌లు ఉన్నాయి.. అందుకే ప్రధాన మంత్రి వికసిత్ భారత్ నినాదాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మార్చలేకపోయిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.