Priyanka Gandhi: భారత దేశంలో రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. ఇందులో విపక్షాల తరఫున వాయనాడు ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా చర్చను స్టార్ట్ చేశారు. తొలి ప్రసంగంలోనే అధికార ఎన్డీయేపై విమర్శలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే మన స్వాతంత్ర్య పోరాటం చాలా ప్రత్యేకమైందన్నారు. సత్యం, అహింస అనే పునాదులపైనే మనం పోరాటాం చేశామని ఆమె తెలిపారు. అయితే, భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం.. దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగం అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ లాంటి లాంటి వారు ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
Read Also: Allu Arjun Arrest : బన్నీ అరెస్ట్ కేసులో అదే జరిగితే అంతే..?
అయితే, ప్రజా హక్కులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే అవకాశం రాజ్యాంగం కల్పించిందని ప్రియాంక గాంధీ అన్నారు. ఇది దేశ ప్రజలను కాపాడే సురక్షా కవచంలా ఉండటంతో.. దాన్ని అధికార ఎన్డీయే ప్రభుత్వం బలహీనపర్చేందుకు ఎన్నో కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గత పదేళ్లలో ఈ రక్షణ కవచాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపర్చిందని విమర్శించింది. లేట్రల్ ఎంట్రీ, ప్రైవేటీకరణ లాంటి చర్యలతో రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు మోడీ సర్కార్ యత్నిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూసిందని ఎద్దేవా చేసింది. అలా జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై ఇప్పుడు వెనక్కి తగ్గిందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.
Read Also: Swarnandhra @ 2047 Vision Document: స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ..
ఇక, బీజేపీ గతం గురించే మాట్లాడుతుంది.. దేశ ప్రగతి కోసం ప్రస్తుతం ఏం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేసింది. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా అని ప్రశ్నించారు. నెహ్రూ పేరును, ఆయన ప్రసంగాలను మీరు పుస్తకాల నుంచి తొలగిస్తారేమో కానీ.. స్వతంత్ర్య పోరాటంలో, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరని ఆమె అన్నారు. ఇక, రాజ్యాంగం అంటే సంఘ్ (ఆర్ఎస్ఎస్) బుక్ కాదు.. సంవిధాన్ అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా 2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనను గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు పోరాడే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పుకొచ్చింది.
LIVE: संसद से सड़क तक: जय संविधानhttps://t.co/GC4zbYwoWY
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 13, 2024