ఎన్నికల ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రయోజనాల కోసం హిందూ-ముస్లిం వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్ ఎంపీ టికెట్ ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు బీజేపీ కేటాయించింది. దీంతో శుక్రవారం నాడు కరణ్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హల్ చల్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
ఉత్తరప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.