కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రయోజనాల కోసం హిందూ-ముస్లిం వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నిర్ణయాల వల్ల ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఫైర్ లేదని వ్యాఖ్యానించారు. జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్
కాంగ్రెస్.. ముస్లిం సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందన్నారు. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే రాజకీయాలు చేయకూడదని సూచించారు. రాజకీయాల లక్ష్యం దేశ నిర్మాణానికి నాందిపలకాలని సూచించారు. కానీ కాంగ్రెస్ మాత్రం సామాజిక సామరస్యానికి భంగం కలిగించాలనుకుంటోందని రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామన్న ఆ పార్టీ యోచనతో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని విమర్శించారు. అర్జెంటీనా, వెనిజులా ఇలానే అమలు చేశాయి. ఆ తర్వాత వినాశకరమైన పరిణామాలను ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు. అంతేకాదు పెట్టుబడిదారులు దేశంపై విశ్వాసాన్ని కోల్పోతాయని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Costly Whisky In India: అత్యంత ఖరీదైన విస్కీ.. ధర వింటే మైండ్ బ్లాకే…
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 370 సీట్లు వస్తాయని.. ఇక ఎన్డీఏ కూటమికి 400 సీట్ల మార్కు దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి సీట్లు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో కొన్ని సీట్లు వస్తాయని.. కేరళలో కూడా బీజేపీ ఖాతా తెరవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే ఒడిశా, జార్ఖండ్, అస్సాంలో కూడా సీట్లు పెరుగుతాయని.. ఛత్తీస్‌గఢ్‌లో అయితే మాత్రం స్వీప్ చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని వెల్లడించారు. దేశ ఐక్యత విషయంలో రాజీపడబోమన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అమలు చేసి తీరుతామని రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Y. V. Subba Reddy: కూటమి అభ్యర్థుల మాటలు నమ్మి మోసపోవద్దు