Delhi: ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. ట్రాన్స్‌జెండర్ నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతో పాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Death Threat: రాజస్థాన్ మంత్రికి హత్య బెదిరింపులు.. కేసు నమోదు..
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..
రాజన్ సింగ్ చేతిలో రూ. లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, రూ.15.10 లక్షల విలువైన ఆస్తులను బ్యాంక్ ఖాతాలో ప్రకటించారు. అలాగే ఎలాంటి స్థిరాస్తులు లేవని రాజన్ సింగ్ ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది.అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానుంది.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!