సార్వత్రిక ఎన్నికల హోంమంత్రి అమిత్ షాకు చెందిన డీప్‌ఫేక్ వీడియో తీవ్ర కలకలం రేపింది. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఒక నకిలీ వీడియో రావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
యువరాజు (రాహుల్ గాంధీ)ను ప్రధానమంత్రిని చేసేందుకు పాక్ ఉవ్విళ్లూరుతోంది.. పాకిస్థాన్‌కు కాంగ్రెస్‌కు మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరి అంజనీని జేఎంఎం ప్రకటించింది. అంజనీ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె. మయూర్‌భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పొరు నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల వేల బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 400 సీట్లు లక్ష్యంగా ప్రచారంలో కమలం పార్టీ దూసుకెళ్లోంది. ఇలాంటి తరుణంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అయితే ఎన్నికల మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ సాగుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు ప్రత్యేకం కావడమే కారణం.
Rajput Issue:రాజ్‌పుత్ వర్గం బీజేపీపై మండిపడుతోంది. అయితే, ఈ కోపాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. క్షత్రియ సామాజికవర్గంలో బీజేపీపై నెలకొన్న కోపాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
Loksabha Election 2024 : అమేథీలోని గౌరీగంజ్‌లోని కాంగ్రెస్ భవన్ కాంప్లెక్స్‌లో మంగళవారం సాయంత్రం బ్లాక్ ప్రెసిడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.