Health Tips: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బరువుతో బాధపడుతున్నారు. పెరుగుతున్న వయసుతో పాటు కొంతమంది బరువు కూడా పెరిగిపోతున్నారు. దీంతో 30 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుండటంతో చిన్నతనంలోనే అనేక జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరిగితే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే బరువు పెరగకుండా ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం అవసరం. మరోవైపు…
Health Warning: మనిషి ఆరోగ్యంలో నిద్ర చాలా ముఖ్యం. నిద్ర వల్ల అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. ఎన్నో రోగాలకు నిద్ర సహజ ఔషధంగా పనిచేస్తుంది. అలాగే నిద్ర కారణంగా శరీరంలోని ప్రతి అవయవానికి తిరిగి సత్తువ చేరుతుంది. అయితే అతి నిద్ర అయినా, నిద్ర తక్కువ అయినా అది ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్య వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసహజంగా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి నిద్ర సమయంలో…
Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం…
Love Signs: ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటుంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డవాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు గమనించాలి.…
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది.…
దేశంలోని యువతకు గుండెపోటు టెన్షన్ పట్టుకుంది. గుప్పెడంత గుండె చిన్న వయసులోనే ముప్పుకు గురవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు భయం వెంటాడుతోంది. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉండటం కలవరపెడుతోంది. అయితే మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తేలింది. ఫిట్‌గా ఉన్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువైనా గుండెపోటు వస్తుండటంతో ఏం…
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ సైకిళ్లను పక్కనపెట్టేసి బైకులు, కార్లనే వాడుతున్నారు. దీంతో సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతున్నారు. అందుకే 2016లో ప్రపంచ సైక్లింగ్ అలయెన్స్ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్ సమాఖ్య (ఈసీఎఫ్) కలిసి ప్రతి ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి.…
మారుతున్న కాలానికి అనుగుణంగా వాతారణంలో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గాలి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇలాంటి వాతావరణంలో మానవాళికి అనేక వ్యాధులు, జబ్బులు రావడం సహజమే. అయితే ప్రధానంగా సీజనల్ జబ్బులు చాలా ఇబ్బందులు పెడుతాయి. మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు శారీరక శ్రమ కూడా తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ,శీతాకాలంలో మాత్రం గొంతునొప్పి సమస్య తీవ్రంగా…
ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు. ఈ ప్రపంచం అన్ని కళలతో నిండి ఉంది. కొన్ని కొన్ని కళలు మనల్ని ఎంతో అశ్చర్యానికి గురి చేస్తాయి. మ్యాజిక్ గురించి మాట్లాడుకుంటే.. మన కళ్లను కనికట్టు చేస్తూ.. గారడీ ప్రదర్శిస్తారు. ఇదే కాకుండా.. కొన్ని కొన్ని కళలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మామూలుగా మనం ఏదో సినిమా పోస్టర్ చూసినప్పుడు.. ముందుగా ఒక్కొక్కరు ఒక్కోటి గమనిస్తుంటారు. పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేవారు కొందరుంటారు. అయితే.. కొన్ని ఫోటోలలో ఎన్నో వింతలు దాగి…