World Bicycle Day 2022: సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోవడంతో అందరూ సైకిళ్లను పక్కనపెట్టేసి బైకులు, కార్లనే వాడుతున్నారు. దీంతో సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతున్నారు. అందుకే 2016లో ప్రపంచ సైక్లింగ్ అలయెన్స్ (డబ్ల్యూసీఏ), ఐరోపా సైక్లిస్ట్స్ సమాఖ్య (ఈసీఎఫ్) కలిసి ప్రతి ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి. ఈ మేరకు 2018, ఏప్రిల్ 12న న్యూయార్క్‌లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ప్రపంచ సైకిల్ దినోత్సవ తీర్మానం ఆమెదించబడింది.
నిజానికి సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సైకిల్ తొక్కడం శరీర వ్యాయామానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ సైకిల్ తొక్కితే బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు దరిచేరవు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పనిచేస్తుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. రోజూ దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
Also Read
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
Health Tips: నడుము నొప్పి వస్తుందా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
రోజూ ఒక గంట సైక్లింగ్ చేయడం వల్ల దాదాపు 300 కేలరీలు బర్న్ అవుతాయి. సైకిల్ తొక్కితే శరీరంలోని బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. నిత్యం సైకిల్ తొక్కే వారికి రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది. సైక్లింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!