Health Tips: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బరువుతో బాధపడుతున్నారు. పెరుగుతున్న వయసుతో పాటు కొంతమంది బరువు కూడా పెరిగిపోతున్నారు. దీంతో 30 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుండటంతో చిన్నతనంలోనే అనేక జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరిగితే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే బరువు పెరగకుండా ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం అవసరం. మరోవైపు ఆహారం విషయంలోనూ తగుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వయసుతో పాటు బరువు కూడా పెరగకుండా ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. ఇందుకోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తృణధాన్యాలతో పాటు వెజిటేబుల్స్ లాంటివి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే తేలికపాటి డైట్ ఫాలో అవ్వాలి. అలాంటి వారు రోటీ వెజిటేబుల్స్, సలాడ్స్ విత్ దాల్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా వేసవిలో మధ్యాహ్న సమయంలో భోజనంలో శెనగపప్పు లేదా మజ్జిగను తీసుకోవచ్చు. అలాగే పండ్లను తినడం లేదా జ్యూస్ తాగడం లాంటివి చేయాలి.
Read Also: Ramakrishna Math: బుక్ లవర్స్‌కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్
బరువు పెరగకూడదని భావించిన వాళ్లు శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే శరీరంలో నీటి కొరత ఏర్పడి ఒంట్లో శక్తి తగ్గుతుంది. అంతేకాదు నీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. సాయంత్రం అయిందంటే చాలామంది స్నాక్స్ తినడానికి ప్రాముఖ్యత ఇస్తారు. వీరిలో ఎక్కువమంది టీ తాగుతూ ఉంటారు. అయితే టీలో ఉండే పాలు శరీరంలో చక్కెర శాతం పెంచి బరువు పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి టీకి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే డిన్నర్ సమయంలో ఎక్కువగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో కూరగాయలు, రోటి పప్పును మాత్రమే తినాలి. అలాగే చీజ్ సలాడ్ లేదా సోయాబీన్ మిక్స్ సలాడ్, ఓట్ మీల్ లేదా కిచిడీ తీసుకున్నా మీ బరువు అదుపులో ఉంటుంది.