ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు.
పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం లభిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సమస్యలు పరిష్కారం అవుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. లెమన్ వాటర్ జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత హెడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఆమ్లం మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమని సూచిస్తున్నారు.
నిమ్మకాయ నీరు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం తక్కువ. అంతేకాకుండా నిమ్మకాయ నీరు తాగడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఉండదు. ఇందులో చాలా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా.. ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో కాలేయం శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఏర్పడటానికి చాలా సహాయపడుతుంది. అలాగే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది.