Love Signs: ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటుంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డవాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు గమనించాలి.
మనసుకు నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు మీ కళ్లలో మీకు తెలియకుండా వెలుగు కనిపిస్తుంది. మీరు గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ కలిగితే మీరు కచ్చితంగా ప్రేమలో ఉన్నట్లే. మీకు నచ్చిన వ్యక్తితో రాత్రిపూట ఎక్కువగా మాట్లాడుతుంటే, ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా కలిసినప్పుడు మీకు ఏర్పడే ఫీలింగ్స్ కూడా ప్రేమను తెలియజేస్తాయి. ఒక అబ్బాయికి ఓ అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరిగితే అతడు ప్రేమలో పడినట్లే భావించాలి. అలాగే అమ్మాయిలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. నచ్చిన వ్యక్తిని సర్‌ప్రైజ్ చేయడం, వారికి పదే పదే బహుమతులు ఇవ్వాలని భావించడం వంటివి చేస్తే మీరు ప్రేమలో ఉన్నట్లే. నచ్చిన వ్యక్తులు మీతో లేకపోయినా వారి గురించే ఎక్కువగా ఆలోచించినా.. వాళ్లతో గడిపిన క్షణాలను గుర్తుకుతెచ్చుకున్నా మీరు ప్రేమలో పడ్డారని భావించాలి.
Read Also: Gold Rate Today: రాకెట్లా దూసుకెళ్లిన బంగారం ధర.. ఏకంగా 7నెలల గరిష్టానికి పెంపు
మనకు నచ్చిన వ్యక్తి ఇతరులతో క్లోజ్‌గా ఉంటే నచ్చదు. దానినే అసూయ అంటారు. ఇలాంటి లక్షణం ఉంటే మీరు ప్రేమలో పడినట్లే. నచ్చిన వ్యక్తి కోసం రెడీ కావడం, వాళ్లకు నచ్చిన బట్టలు వేసుకోవాలని తాపత్రయ పడటం వంటివి కూడా ప్రేమలో పడ్డారనే సంకేతాలను తెలియజేస్తాయి. అంతేకాకుండా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎమోషనల్, ఫిజికల్, సెక్స్‌వల్ పరంగా మీరు సేఫ్‌గా ఫీలవుతూ ఉంటే అది కూడా ప్రేమ అని భావించవచ్చు. మీ కష్టాలు, సుఖాలను షేర్ చేసుకునేందుకు మీకో వ్యక్తి దొరికినట్లు అనిపిస్తే వాళ్లతో మీరు ప్రేమలో పడినట్లే.