బరువు తగ్గడం కోసం ఇప్పుడు అందరూ సైకింగ్ చేస్తున్నారు. అయితే సైక్లింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సైక్లింగ్ మీ శరీరం కోసమే కాదు, మీ మనసుకి కూడా ఉల్లాసాన్ని ఇస్తుంది. మీరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా మెంటల్ హెల్త్‌కు సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.
యావత్తు మానవ జాతిపై కరోనా వైరస్ ప్రభావం మామూలుగా చూపలేదు. నిద్రలో కూడా కరోనా అంటే భయపడే స్థాయికి ప్రజలు భయాందోళన చెందారు. కరోనా మహమ్మారి ప్రభావం మానవజాతిపై తీవ్రంగా పడిందని సర్వేలు చెబుతున్నాయి. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయి. ఇప్పడు మరోప్రమాదం మానవ జాతిపై పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదే మైక్రో ప్లాస్టిక్.. ఈ మైక్రో ప్లాస్టిక్ మానవుల…
కొంతమంది పగలు మొత్తం విపరీతంగా పనిచేసి రాత్రిళ్లు ఫుల్లుగా తినేస్తుంటారు. కానీ రాత్రిళ్లు ఎక్కువ మొత్తంలో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ కొన్నిరకాల ఆహారాలు అసలు తినకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ✪ బీట్‌రూట్: బీట్‌రూట్ చాలా పోషకాలున్న వెజిటేబుల్. కానీ రాత్రి వేళ దీన్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే రాత్రిపూట బీట్‌రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర…
రాత్రిపూట కొంతమంది సరిగ్గా నిద్రపోరు. మొబైల్ లేదా టీవీ చూస్తూ లేటుగా నిద్రపోతుంటారు. మళ్లీ ఉదయాన్నే లేచి తమ పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారికి కంటి నిండా నిద్ర ఉండదు. అయితే ఇలాంటి అలవాటు భవిష్యత్‌లో జీవక్రియలపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివారు పగలు నిద్రపోవాలని ఆలోచిస్తుంటారు. కానీ పగటి నిద్రకు, రాత్రి నిద్రకు చాలా తేడా ఉంది. ఎందుకంటే రోజంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి రాత్రిపూట…
వేసవి సీజన్ వచ్చేసింది. వేసవిలో ప్రతిఒక్కరూ ఫ్రిజ్ కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తారు. ఫ్రిజ్‌లోని నీరు తాగాలని ఆరాటపడతారు. అయితే అలాంటి వారికి మట్టికుండ విలువ తెలియదు. సాధారణంగా మట్టికుండను పేదవాడి ఫ్రిజ్ అంటారు. మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు అమృతంలా ఉంటాయని మన పెద్దలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలం మారే కొద్దీ మట్టి కుండలు కాకుండా జనాలు రిఫ్రిజిరేటర్లకు అలవాటు…
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1975 నుంచి ప్రపంచంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2030 నాటికి ప్రపంచంలోని యుక్త వయసు కలిగి ఉన్నవారిలో సగం మంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న జనాభా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇండియాలో ఊబకాయం ప్రాబల్యం 40.3…
శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.…
ప్రతి మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు మనిషిని నాశనం చేస్తాయి. అలాంటి అలవాట్ల కారణంగా మనకు మనమే నాశనం అయిపోతాం. ఒకవేళ ఆ అలవాట్లు మీకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా… జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీకు గుణపాఠం నేర్పించడం ఖాయం. అవి ఏంటంటే… వాయిదా వేయడం, ఫిర్యాదు చేయడం, అతిగా ఆలోచించడం, పోల్చుకోవడం, సేఫ్ జోన్‌లో ఉండాలనుకోవడం. ✪ వాయిదా వేయడం: ఏవేవో చేయాలనుకుంటాం.…