తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసుకున్నారు.. సినిమా వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.. ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం మాకు లేదు.. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం చెప్పలేదు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు.. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదు. ఎంట్రీ ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.. నటీనటుల కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదు..” అని డీసీపీ వివరించారు.
READ MORE: MP Bastipati Nagaraju: విజయసాయి రెడ్డి.. సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది: కర్నూలు ఎంపీ
9.30 కి తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. “అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారు.. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఇదే సమయంలో థియేటర్లోని కింది అల్లు అర్జున్ కలిసి లోపలికి వెళ్లారు.. ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇదే సమయంలో దిల్‌సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుమారుడితో ఆ ప్రాంతంలో ఉంది. అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగారు. 13 ఏళ్ల శ్రీతేజ్ కు సీపీఆర్ చేశారు. రేవతి కుమారుడు శ్రీ తేజను దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీ తేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బీఎన్‌ఎస్ లోని 105 118(1), రెడ్ విత్ త్3(5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు కారణమైన బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్, థియోటర్ మేనేజ్ మెంట్, సెక్యూరిటీ టీంపై కేసులు నమోదు చేశాం” అని వివరించారు.