దేశ రాజధానిలో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా…
ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలోకు హాజరైన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మహిళలను లక్షధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఐరోపా దేశమైన నార్వేలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. నార్వేలోని ఓ గ్రామంలో వైద్యుడు 87 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును నార్వే చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఇలాంటి ఈ మహిళలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. 55 ఏళ్ల నిందితుడి పేరు ఆర్నే బై. 87 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో ఇద్దరు మైనర్లు బాలికలు ఉన్నట్లు తెలిసింది.…
చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో గుండెపోటు పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్‌లో ఇది 18వ వేలం కావడం విశేషం.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘనవిజయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాల సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. బీజేపీ, ఎన్సీపీ, షిండే సేన కూటమి 288 స్థానాలకు గాను 235 స్థానాలను కైవసం చేసుకుంది. మహావికాస్ అఘాడీ కేవలం 50 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహావికాస్ అఘాడీ పార్టీల పరిస్థితి స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగానే మిగిలిపోయింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం, యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలో ఓట్లు పొందేందుకు వీర్ సావర్కర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ తాత్కాలికంగా నిలిపివేసిందని ప్రధాని పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార మహాయుతి గెలుపు స్పష్టమైంది. కాగా, ఎంవీఏ ప్రస్తుతం 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని 288 స్థానాలకు అక్టోబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరిగింది. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో 65 శాతానికి పైగా ఓటింగ్ జరగడంతో 30 ఏళ్ల రికార్డు బద్దలైంది.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగగా, బీడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీడు అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ సందర్భంగా ఓ స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు.