Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
- కెనడాలో భారతీయులపై పెరుగుతున్న దాడులు
- తాజాగా 22 పంజాబ్‌కి చెందిన విద్యార్థి హత్య
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
READ MORE: BJP Poru Sabha: నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 1న ఈ ఘటన జరిగినట్లు సర్నియా పోలీసులు తెలిపారు. భారతీయ విద్యార్థి గురాసిస్ సింగ్ సర్నియాలోని లాంబ్‌టన్ కళాశాలలో మొదటి సంవత్సరం బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. అయితే సహచరుడైన క్రాస్‌లీ హంటర్‌తో కలిసి.. క్వీన్ స్ట్రీట్‌లోని ఓ గదిలో కలిసి ఉండేవాడు. వంటగదిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో గురాసిస్ సింగ్ రూమ్మేట్ అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై విద్యార్థి మృతి చెందాడు. మొత్తం ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవకు కారణమేమిటనేది కూడా ఆరా తీస్తున్నారు. అలాగే అన్ని రకాల ఆధారాలు సేకరించేందుకు పోలీసులను మోహరించారు. “ఈ దాడికి జాతి వివక్షతో సంబంధం లేదు” అని సర్నియా పోలీస్ చీఫ్ డెరెక్ డేవిస్ అన్నారు.
READ MORE: Gaza: గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు హాజరుపరిచారు. గురాసిస్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ లాంబ్‌టన్ కళాశాల ఒక ప్రకటన విడుదల చేసింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. తమ కళాశాల సింగ్ కుటుంబంతో సన్నిహితంగా ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!