కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు. వంద రోజులు పూర్తయ్యాయని.. 200 రోజులు దాటిపోయాయి.. ఎల్లుండితో 365 రోజులు పూర్తికానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాది తర్వాత వాళ్లకు మరోసారి జ్ఞాపకం చేసేందుకే బీజేపీ హైదరాబాదులో సభ నిర్వహిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
READ MORE: Russian President: త్వరలోనే భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడతాం..
అలాగే దేశంలో బొగ్గు గనుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడారు. భారత దేశంలో కోల్ సెక్టార్ అనేక సంస్కరణలు తెస్తున్నట్లు చెప్పుకొచ్చారు. “2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక కోల్ సెక్టార్ మొత్తం పారదర్శకంగా నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ కోశాధికారి ఒక తెల్ల కాగితంపై పేర్లు రాసి ప్రధాన మంత్రికి పంపేవారు. నచ్చిన వాళ్లకు ఇచ్చిన వాళ్లకు కోల్ మైన్స్ ను అప్పజెప్పేవాళ్లు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్ సెక్టర్లు అనేక సంస్కరణలను తీసుకువచ్చి పారదర్శకంగా ఆక్షన్ నిర్వహిస్తున్నాం. దేశ అవసరాలకు అనుగుణంగా కోల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కోల్ ప్రొడక్షన్ పెంచి, ఇంపోర్ట్ కోల్ తగ్గించాలన్నది మా లక్ష్యం. ఈ ఏడాది 1080 మెట్రిక్ టన్నుల కోల్ ఉత్పత్తిని టార్గెట్ పెట్టుకున్నాం. పారదర్శకంగా కోల్ బ్లాక్ ల ఆక్షన్ నడుస్తుంది.” అని కేంద్ర మంత్రి వివరించారు.