ఆంధ్ర, తెలంగాణతో పాటు 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు నిర్వహిస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిక అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు జరుగుతున్నాయి. హన్సిక, అనిల్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడ్డారు. 12 ప్రాంతాల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుని వాడుకున్నారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తామంటూ పలు…
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.
హైదరాబాద్‌లో గతేడాది విషాదం నెలకొంది. లంగర్ హౌజ్ లో చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది. విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సైనికుడికి ఈ ప్రమాదం జరిగింది. మాంజా మెడకు చుట్టుకోవడంతో సైనికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సైనికుడు కోటేశ్వరరావు మృతి చెందాడు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా నేపథ్యంలో మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కెనడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై జస్టిన్ ట్రూడో తొలిసారి స్పందించారు. తన రాజీనామాను ప్రకటించిన ట్రూడో, కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశం లేదని అన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, భద్రతా…
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. తాజాగా గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. ప్రస్తుతం వందకు…
ప్రస్తుత కాలంలో ఇంట్లో కుక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకూ అందరూ వివిధ రకాల కుక్కల, పిల్లులను పెంచుకుంటున్నారు. కొంత మంది కుక్కలను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. మరి కొందరు రక్షణ కోసం వాటిని పెంచుకుంటారు. అయితే.. ఈ పెంపుడు జంతువుల వల్ల మనుషులకు చాలా ప్రమాదమట. ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం.. READ MORE:…
మారుతీ తన డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 2,52,693 యూనిట్లను విక్రయించింది. ఈ రికార్డు విక్రయంలో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాన్ సెగ్మెంట్ అయిన ఈకో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. వాస్తవానికి.. గత నెలలో ఈకో 11,676 యూనిట్లు విక్రయం జరిగింది. గతేడాది డిసెంబర్‌లో 10,034 యూనిట్లు అమ్ముడయ్యాయి. విశేషమేమిటంటే..
పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..