నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
READ MORE: Earthquake: దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం.. బీహార్ నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు
నేడు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. నేడు ఉదయం 10:30 గంటల సమయంలో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే మాజీమంత్రి కేటీఆర్.. ఏసీబీ విచారణకు లీగల్ టీంతో వెళ్లారు. తన వెంట లీగల్ టీంని అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. విచారణ అంశాన్ని ఏసీబీ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇవాళ్టి తీర్పు మీదే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు.. ఫార్ములా ఈ రేసు కేసును ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు దర్యాప్తుచేస్తున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడీకి కేటీఆర్ తెలిపారు.. కేటీఆర్ రిక్వెస్ట్ ని ఆమోదించిన ఈడీ.. ఇంకా తదుపరి విచారణ తేదీ ప్రకటించలేదు.
READ MORE: Bharatpol: నేడు ‘భారత్‌పోల్’ పోర్టల్‌ను ప్రారంభించనున్న అమిత్ షా.. ఇక, నేరస్థులకు దబిడిదిబిడే