ప్రస్తుత కాలంలో ఇంట్లో కుక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకూ అందరూ వివిధ రకాల కుక్కల, పిల్లులను పెంచుకుంటున్నారు. కొంత మంది కుక్కలను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. మరి కొందరు రక్షణ కోసం వాటిని పెంచుకుంటారు. అయితే.. ఈ పెంపుడు జంతువుల వల్ల మనుషులకు చాలా ప్రమాదమట. ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ సుభాష్ సూసైడ్ కేసు.. భార్య నిఖితా సింఘానియాకు బెయిల్..
పిల్లలకు పాలిచ్చి పెంచే క్షీరదజాతి జంతువులైన కుక్కులు, పిల్లులు, తదితరాల నుంచి రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలాజలంలో వ్యాధికారక క్రిములు ఉంటాయి. పెంపుడు జంతువులతో దగ్గరగా ఉన్నప్పుడు అవి కరచినా, తుమ్మినా వ్యాధి క్రిములు మన శరీరంలోకి చేరతాయి. తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం వంటివి రేబిస్ లక్షణాలు. ఇది ప్రాణాంతక వ్యాధి. రేబిస్ వేక్సిన్ తీసుకున్నప్పటికీ ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వరకు మాత్రమే రక్షణ లభిస్తుంది. పెంపుడు జంతువులతో గడుపుతున్నపుడు మాస్కులు ధరించడం, తరచూ చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. పెంపుడు జంతువులకు ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన చికిత్సలు అందించాలి.
READ MORE: Namo Namah Shivaya: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తండేల్ ‘నమో నమశ్శివాయ’