మారుతీ తన డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 2,52,693 యూనిట్లను విక్రయించింది. ఈ రికార్డు విక్రయంలో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాన్ సెగ్మెంట్ అయిన ఈకో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. వాస్తవానికి.. గత నెలలో ఈకో 11,676 యూనిట్లు విక్రయం జరిగింది. గతేడాది డిసెంబర్‌లో 10,034 యూనిట్లు అమ్ముడయ్యాయి. విశేషమేమిటంటే.. ఈ కారు సైలెంట్‌గా అమ్ముడైంది. దీని గురించి ఎవ్వరూ పెద్దగా ప్రస్తావించలేదు. కానీ అమ్మకాల పరంగా ఇది చాలా కార్ల కంటే మెరుగ్గా ఉంది. ఈకో ఓ యుటిలిటీ కారు.. ఇది 5, 7 సీట్ల ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది. ఈకో బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.32 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 6.58 లక్షల ఎక్స్-షోరూమ్‌కు వరకు ఉంటుంది.
READ MORE: Yuzvendra Chahal Divorce : స్టార్ స్పిన్నర్ చాహల్, నటి ధనశ్రీ విడాకులపై క్లారిటీ వచ్చేసింది..
ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 81 పీఎస్ పవర్, 104.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్జీ మోడల్‌లో కూడా దొరుకుతుంది. సీఎన్‌జీలో నడుస్తున్నప్పుడు దాని పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. సీఎన్‌జీ వేరియంట్ 72 పీఎస్ పవర్, 95ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజీ గురించి చూస్తే.. పెట్రోల్ ఇంజన్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ ఇంజన్ కిలోగ్రాముకు 27 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇందులో మాన్యువల్ ఏసీ, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, డిజిటల్ స్పీడోమీటర్, ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, ఈబీడీ, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో కూడిన ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
READ MORE: Pani Puri: “పవర్ ఆఫ్ పానీపూరీ”.. ఏడాదిలో రూ. 40 లక్షల చెల్లింపులు.. జీఎస్టీ నోటీసులు..