లంబోర్ఘిని తన చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది. 2024లో కంపెనీ మొత్తం 10,687 వాహనాలను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇది చారిత్రాత్మక విజయం.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
సంక్రాంతి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామంలోనే బస చేసి... అక్కడే టెంట్, అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఇలాగే గ్రామాల్లో టెంట్‌లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం ఉంది.
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది.
Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్‌షహర్‌లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది. Read Also: Telangana: “భూభారతి”కి గవర్నర్…
Tirupati Stampede Live Updates: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు.. టోకెన్ల కోసం తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్. పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే పొదుపు ఫ్యూచర్ లో మీకు అండగా నిలుస్తుంది. ఆపద సమయంలో మీరు సేవ్ చేసుకున్న సొమ్ము ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఆపద సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. మరి మీరు కూడా సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం పోస్ట్ ఆఫీస్…
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు…