హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూశారు. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు.ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్త చేసింది.
నేడు జిల్లాలో నాగర్‌కర్నూల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మార్కండేయ లిఫ్ట్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. బిజినేపల్లి మండలంలోని శాయిన్‌పల్లిలో నిర్మించిన మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ రూ. 88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ డివిడెండ్ చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి అందజేశారు. సింగరేణి కాలరీస్ చెల్లింపు మూల ధనం(పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ) లో 10 శాతాన్ని డివిడెంట్‌గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం సుమారు రూ.173 కోట్లు కాగా.. సింగరేణిలో 51 శాతం వాటా…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన రిలీజ్ అవుతుంది.. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భిన్నంగా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించింది సినిమా టీం. ఇక ఈ సందర్భంగా వెంకటేష్ గతంలో నటించిన…
నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన వీటిని తిరిగి ఉపయోగించే అవకాశం లేదు. మట్టిలో కలిసిపోవడానికి దశాబ్దాల సమయం పడుతోంది. అడ్డూ అదుపూ లేకుండగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు.
సంక్రాంతి వచ్చేసింది. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విలసిల్లి.. మకర సంక్రాంతి మరుపురాని మధుర స్మృతులకు వేదికవుతుంది. ఆరుగాలం కష్టపడిన పండించిన పంట ఇంటికి వస్తుంది. అందుకే దీన్ని కర్షకుల పండగ అని కూడా పిలుస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది పేరుమోసిన నక్సలైట్లు శనివారం లొంగిపోయారు. వీరంతా భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరావాసం కల్పిస్తారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు. సుక్మాతో సహా ఏడు జిల్లాలు ఈ ప్రాంతంలో వస్తాయి.
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2025 అవార్డు ప్రకటించారు. ఈ నామినేషన్‌లో మారుతీ డిజైర్, మారుతీ స్విఫ్ట్, మహీంద్రా థార్ రాక్స్, ఎమ్‌జీ విండ్సర్ ఈవీ, సిట్రోయెన్ బసాల్ట్, టాటా కర్వ్, కర్వ్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, BYD eMAX 7 పాల్గొన్నాయి. అయితే.. ఓ కారు మాత్రం వీటిన్నింటినీ అధిగమించించి ఈ అవార్డును సొంతం చేసుకుంది.