ప్రత్యక్ష సాక్షుల రూపంలో ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే హత్యాయుధం రికవరీ చేయనప్పటికీ, హత్య కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్‌లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో…
ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు తర్వాత ఈసారి హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జడివాన నగర ప్రజలను వణికించింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఇటీవల కాలంలో తిరుమలకు భక్తుల రాక విపరీతంగా పెరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకోని భక్తులు ప్రస్తుతం తిరుమల బాట పడుతున్నారు. తమకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వీకెండ్లలోనే కాకుండా వీక్ డేస్‌లోనూ తిరుమల కొండ రద్దీగా కనిపిస్తోంది. అటు సెప్టెంబర్ నెలలో భక్తులు, ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. గత నెలలో మొత్తం 21.12 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపింది. శ్రీవారి హుండీకి రూ.122.19 కోట్ల…
Soaps Prices: ధరల భారంతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట లభించింది. సబ్బులు, డిటర్జెంట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. ముడిసరకు ధరలు అదుపులోకి రావడంతో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూస్థాన్ యూనిలీవర్ విక్రయిస్తున్న సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 మిల్లీలీటర్ల…
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Read Also:…
Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ, పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత.. గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్‌గా భావన.. శ్రీకాకుళం జేసీగా నవీన్.. పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్.. మిడ్ డే మీల్స్ డైరెక్టర్‌గా నిధి మీనా.. ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. Read Also:…
Raghuveera Reddy: ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ఆలయ నిర్మాణం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తన యథాస్థితి కొనసాగుతుందన్నారు. అయితే అనంతపురం జిల్లాలో త్వరలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని రఘువీరారెడ్డి తెలిపారు. భారత్ జోడో…
Andhra Pradesh: ఏకలవ్య మోడల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఏకలవ్య జాతీయ క్రీడలు జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, లయోలా కాలేజీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బీఆర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్ కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అండర్-14, అండర్-19 కేటగిరీల్లో జరిగే ఏకలవ్య జాతీయ క్రీడల్లో దేశవ్యాప్తంగా 5,970 మంది క్రీడాకారులు పాల్గొంటారు.…
Gold Rates: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బులియన్ మార్కెట్లో బుధవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.47,350కి చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660గా ఉంది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.4,200 పెరిగి రూ.66,700కి చేరింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. Read…