తమ ఇష్టాన్ని కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కన్నకూతురు అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెకు కోలుకోలేని గాయాన్ని చేశారు.
CM Ramesh: రాజ్యసభ ఎథిక్స్ కమిటీని పునర్‌వ్యవస్థీకరిస్తూ సభ కార్యాలయం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్‌ను నియమించింది. అటు ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేష్‌కు అరుదైన అవకాశం దక్కింది. హౌస్ కమిటీ ఛైర్మన్‌గా సీఎం రమేష్‌ను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి సభ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజ్యసభ నుంచి ఈ నెల…
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీతో దురుసుగా ప్రవర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని.. ఇలా అయితే స్పందన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కలెక్టర్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టర్ ముందు పేపర్లు విసిరేసి బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా పనికిరావంటూ దుర్భాషలాడారు. జిల్లా కలెక్టర్ తనను బయటకు…
Andhra Pradesh: శ్రీకాకుళంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జోరుగా జరిగాయి. ఈ సందర్భంగా టెక్కలిలోని వెంకటేశ్వర కాలనీలోని ఆయన ఇంటి ఆవరణలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళా డ్యాన్సర్లతో ఈ కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో పోలీస్ శాఖకు చెందిన పలువురు కూడా పాల్గొన్నారు. డ్యాన్సర్లతో పాటు వాళ్లు కూడా డ్యాన్యులు చేసి హోరెత్తించారు. టెక్కలి ఎస్సై హరికృష్ణ స్టేజీపై అదిరిపోయే స్టెప్పులు వేశారు. మహిళా…
Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం కొనాలని భావించేవారికి శుభవార్త అందింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.660 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290గా ఉంది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.64,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ…
Andhra Pradesh: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ…
NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా అధికారి మధుబాబుకు గాయాలయ్యాయి. దీంతో ఆయన బుగ్గ వెంట రక్తం కారింది. వైద్యులు వెంటనే స్పందించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు ఇదే ఘటనలో చంద్రబాబు పీఎస్‌వోకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి రాయి విసిరిన సమయంలో విద్యుత్…
Police Statement: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై రెక్కీ నిర్వహించారన్న వార్త కలకలం సృష్టించింది. ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పవన్ రెక్కీ వివాదంపై దర్యాప్తు జరపాలని.. ఒకవేళ తెలుగు రాష్ట్రాల వల్ల కాకపోతే కేంద్ర ప్రభుత్వం బరిలోకి దిగి విచారణ చేయిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. తాజాగా ఈ అంశంపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ లేదా దాడికి…
Telugu Desam Party: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనితో పాటు గురువారం అయ్యన్న పాత్రుడు వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ…
Edible Oil Prices: సామాన్యులకు మళ్లీ షాక్ తగలనుంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లీ పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140-150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం…