What’s Today: * తెలంగాణలో 8వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర.. నేడు బాలానగర్ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా సాగనున్న యాత్ర * బాపట్ల జిల్లా: నేడు కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున * నేడు నెల్లూరు జెడ్పీ సమావేశం.. హాజరుకానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి *…
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్ఎస్ ట్యాంక్ ఎగిరిపడింది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్యాన్నదానం నిర్వహించే చోట ఈ ప్రమాదం జరిగింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవస్థానం…
Sabari Express: గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా ఓ ఇనుప రాడ్డును ఉంచిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. కంకరగుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై అడ్డంగా కొందరు దుండగులు ఇనుప రాడ్డును బిగించారు. దీంతో సోమవారం సాయంత్రం సికింద్రాబాద్-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే సమయంలో స్థానికులు ఈ ఇనుప రాడ్డును గుర్తించారు. సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకో పైలెట్ మంజునాథ్…
Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో…
Janasena Party: అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఏసీ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పవన్ విశాఖ పర్యటనపై తీర్మానాన్ని జనసేన పార్టీ ప్రవేశపెట్టింది. పవన్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించిందని తీర్మానంలో ఆరోపించింది. ఈ చర్యలను…
Raghuram passes away: మానవ దేహంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయంలో తయారయ్యే బైలురుబిన్ అధికంగా రక్తంలోకి విడుదలైనప్పుడు కళ్లు, చర్మం, గోర్లు పచ్చగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని పచ్చ కామెర్లు అంటారు. అయితే కొందరు కామెర్ల వ్యాధిని తేలికగా తీసుకుంటారు. దీంతో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో మృతి చెందడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జాండిస్ బారిన…
Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని…
Infosys: ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటీవల మూన్ లైటింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో కూడా పనిచేస్తుండటం. మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సీరియస్ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు కావాలనుకుంటే గిగ్…
What’s Today: * ఢిల్లీ: నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం * ఏపీలో రెండో రోజు భారత్ జోడో యాత్ర.. ఈరోజు ఆదోనీ మండలం చాగీ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ * నేడు పల్నాడు జిల్లాలో మాజీ…
Indian Railways: 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక రైళ్ల ద్వారా భారీస్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలు, ప్రత్యేక దినాల సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే ఎంత మేరకు ఆర్జిస్తుందన్న విషయంపై చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు గత ఆర్ధిక ఏడాది ప్రత్యేక రైళ్ల ద్వారా భారతీయ రైల్వే రూ.17,526.48 కోట్ల ఆదాయం…