Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2022/10/WhatsApp-Video-2022-10-13-at-6.44.24-AM.mp4?_=1Heavy Rain in Hyderabad: ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు తర్వాత ఈసారి హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో జడివాన నగర ప్రజలను వణికించింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ లు వర్షపునీటితో సెల్లార్లను నిండిపోయింది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని వీధులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బోరబండ, సంజీవరెడ్డినగర్, కృష్ణానగర్‌లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో పాటు వర్షం ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
ఇక సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పటాన్‌చెరువు, రామచంద్రాపురం, సేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, హైదర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెట్టించింది. ఎర్రగడ్డ, మూసాపేట, బాలానగర్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యాట్నీ, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, లక్డీకపూల్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిసరాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తి 952 క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసివేసిన రీతిలో విడుదల చేశారు. హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. రెండు గేట్లను ఎత్తి 1373 క్యూసెక్కులు వదిలేలా చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షాలు
బాలానగర్ 10.4cm, బొల్లారం 9.6cm, తిరుమల గిరి 9.5cm, వెస్ట్ మరేడుపల్లి 9.3cm, కుత్బుల్లాపూర్ 9.2cm, కూకట్ పల్లి 7.7 cm, ముసాపేట 7.6cm, కొండాపూర్ 7.4cm, మొండా మార్కెట్ 7.2cm, మల్కాజిగిరి 7cm..
తెలంగాణలో పలు జిల్లాలో చోట్ల భారీ వర్షం కురిసింది.
సిద్దిపేట జిల్లా రామారం 16 cm, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేట లో 13.4cm,
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరులో10.4cm, రంగారెడ్డి జిల్లా కొత్తూరు లో 9.2 cm,
#WATCH | Hyderabad: A person in the Borabanda area along with his two-wheeler washed away, rescued by locals, as heavy rain lashes the city pic.twitter.com/kbTpef43jt
— ANI (@ANI) October 12, 2022