Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..
- బీఎల్ఏ బందీలుగా పాకిస్తాన్ సైనికులు..
- తమను రక్షించాలని వేడుకోలు..
- వారు సైనికులు కాదని పాక్ ఆర్మీ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ముచ్చెమటలు పట్టిస్తోంది. బలూచిస్తాన్‌లో పనిచేయాలంటేనే పాక్ భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. బలూచ్ యోధులు ఇటీవల పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నారు. పాక్ జైళ్లలో ఉన్న బీఎల్ఏ తిరుగుబాటుదారుల్ని విడిచిపెడితే, పాక్ సైనికుల్ని విడిచిపెడుతామని హెచ్చరిస్తున్నారు. పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి బీఎల్ఏ 7 రోజులు అల్టిమేటం విధించింది. ఒక వేళ గడువు దాటితే పాక్ సైనికుల్ని చంపేస్తామని హెచ్చరించింది.
తాజాగా, బీఎల్ఏ మరో వీడియో విడుదల చేసింది. కనీసం 8 మంది పాక్ సైనికులు బీఎల్ఏ వద్ద బందీలుగా ఉన్నట్లు చూపిస్తోంది. అయితే, పాక్ ప్రభుత్వం మాత్రం వాళ్లు సైనికులు కాదని చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన వీడియోలో సైనికులు తమ కార్డులు, సైన్యంలో తమ ర్యాంక్, నెంబర్లు చెబుతున్నారు. పాక్ సైన్యం తమను సైనికులుగా గుర్తించకపోవడాన్ని జీర్ణించుకోలేని బందీలు ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Read Also: చిప్స్ తినడం మానకపోతే శరీరానికి జరిగే నష్టం ఇదే.!
తమను రక్షించాలని ఐడీ కార్డులు, సర్వీస్ కార్డులు చూపుతూ అధికారుల్ని పాక్ సైనికులు వేడుకుంటున్నారు. ‘‘మనం సైనికులం కాదని ఆర్మీ ఎలా చెబుతుంది. ఈ కార్డ్ ఎవరిది.? ఇది నా ఐడెంటిటీ కార్డ్, దీన్ని పాక్ ప్రభుత్వం ఇచ్చింది. నా తండ్రి దివ్యాంగుడు, నేను ఇంట్లో పెద్దవాడిని, మమ్మల్ని సైనికులు కాదని చెప్పి అన్యాయం చేయొద్దు. మమ్మల్ని మీరు రిక్రూట్ చేశారు. ఇప్పుడు ఎలా సైనికులు కాదని చెబుతారు? ’’ అని ప్రశ్నించడం వీడియోలో కనిపిస్తుంది.
‘‘ఆపరేషన్ హెరోఫ్’’ పేరుతో బలూచిస్తాన్ వ్యాప్తంగా పాక్ భద్రతా బలగాలపై బీఎల్ఏ విరుచుకుపడింది. ఆ సమయంలోనే కొందరు పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకుంది. బలూచిస్తాన్‌కు చెందిన వారిని బీఎల్ఏ విడుదల చేసింది. మిగతా వారిని బందీలుగా ఉంచుకుంది. రెగ్యులర్ పాకిస్తాన్ ఆర్మీ యూనిట్లు చెందిన వారే అని బీఎల్ఏ చెబుతోంది. వీరిపై బలూచ్ నేషనల్ కోర్టులో విచారణ జరిపి, శిక్ష విధిస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఖైదీల మార్పిడి కి సిద్ధమైతే శిక్షలు ఆపుతామని చెబుతోంది. అయితే, పాక్ సైన్యం మాత్రం ఏ సైనికులు మిస్సింగ్ కాలేదని, ఎవరూ పట్టుబడలేదని చెప్పింది. ఖైదీల మార్పిడి అవకాశం లేదని స్పష్టం చేసింది.
#BreakingNews
BLA released another video of Pakistani army personnel who are in their custody. One soldier started crying, saying I fight for Pakistan and today the Pakistani army does not own me. My father is disabled and I am the sole provider for my entire family#Balochistan pic.twitter.com/MTTCrXaeeD— Islam Murad Baloch (@IslamMuradBloch) February 19, 2026
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!