Andhra Pradesh Volunteers: ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఫించన్ ఇస్తున్నారు. అయితే కొందరు వాలంటీర్స్ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తూ బాగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన ఫించన్ ఇచ్చినట్టే ఇచ్చి ఫోటోలు దిగి వాలంటీర్లు వెనక్కి తీసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫించన్ రావడంతో…
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదన్నారు.
జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని ఒకే ఇంట్లో ఆరుగురు విగత జీవులుగా కనిపించడం కలకలం రేపింది. ఓ ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్‌కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి ఫకీర్ సురేష్‌ను కత్తితో మెడ కోసి హత్య చేశాడు.
కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బీజేపీ పంచన చేరాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న ఆయన.. అభివృద్ధి కోసమే వారు గులాబీ పార్టీలోకి వచ్చారన్నారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పంటపొలాల్లో విజయ్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సరళతర వ్యాపార నిర్వహణ( ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు లభించింది. మీసేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు ఈ పురస్కారం తెలంగాణను వరించింది.