Sara Arjun: సారా అర్జున్ పేరు వినగానే విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన ముద్దుమోము గుర్తు రాక మానదు. 2011లో ఆ సినిమా వచ్చినపుడు సారా వయసు 6 సంవత్సరాలు. తాజాగా మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో యుక్తవయసులో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. ఈ 17 ఏళ్ల యంగ్ బ్యూటీ తన ఉనికిని చాటుకుని యువత హృదయాలను కొల్లగొడుతోంది. ‘పొన్నియన్ సెల్వన్1’లో విక్రమ్ ఫ్లాష్‌బ్యాక్ వివరిస్తున్నప్పుడు సారా కొద్ది సమయమే కనిపించినప్పటికీ, తన అందమైన…
Araku Coffee: చాలా మంది ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ తాగనిదే ఏ పని కూడా చేయరు. ఓ మంచి కాఫీ తియ్యటి అనుభూతిని అందిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కమ్మగా ఉండే కాఫీ పంట ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్‌ను అరకు కాఫీ విదేశీ మార్కెట్‌లో మరింత సుస్థిరం చేస్తోంది. అంతర్జాతీయంగా…
What’s Today: • తిరుమల: నేడు 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు ఉ.8 గంటలకు సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు • నేడు శ్రీశైలంలో 8వ రోజు దసరా మహోత్సవాలు.. సాయంత్రం మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. నందివాహనంపై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర…
Minister Chelluboina: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌పై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని.. రాజకీయాలు ఒక వికృత క్రీడగా మారిపోయాయని.. ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడటం అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను తక్షణమే గంగుల కమలాకర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.…
CM Jagan: ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తిరుమలకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రి 8:20 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. మంగళవారం రాత్రికి తిరుమలలోనే బసచేయనున్నారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని…
అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. పూలింగ్ గ్రామాలతో పాటు మూడు నాన్ పూలింగ్ గ్రామాలను కూడా కొత్తగా ఏర్పాటు చేసే అమరావతి మున్సిపాల్టీలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి.. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అయితే తొలి రోజు జరిగిన మూడు గ్రామసభల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకతే ఎదురైంది. అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అమరావతి క్యాపిటల్…
Andhra Pradesh: ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని గ్రామ పంచాయతీ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్ కమిషనర్‌కు సీఐటీయూ అనుబంధ పంచాయతీ ఉద్యోగుల సంఘం నోటీసులు పంపింది. తొమ్మిది ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు జారీ చేసింది. బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలని, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం నెలకు రూ.20 వేలు…
కాంగ్రెస్ లో మునుగోడు ఎన్నిక వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటారా? అన్న దానిపై సస్పెన్స్ వీడింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఎప్పుడు పిలిచినా ప్రచారానికి వెళ్తానన్నారు. మునుగోడు ప్రచారానికి వెళ్లనని తొలుత చెప్పిన వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ తర్వాత తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈవిషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడు…
Andhra Pradesh Weather: వర్షాకాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు దంచికొట్టగా ప్రస్తుతం ఆ బాధ్యతను భానుడు అందుకున్నాడు. దీంతో ఏపీలో వర్షాకాలంలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24…