ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి అనే కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’. గత యేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా కన్నడంలో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు సినిమాలను నిర్మించి, చక్కని గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్…
చూస్తుండగానే కొత్త సంవత్సరం మొదటి మాసం గడిచిపోతోంది. 2022కు పాన్ ఇండియా సినిమాలతో శుభారంభం జరుగుతుందని సినీజనం భావించారు కానీ వారి అంచనాలన్నీ తల్లకిందులు చేస్తూ ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ వంటి సినిమాల విడుదల వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతి సీజన్ పూర్తి కాగానే యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. విడుదలైన సినిమాలకు అనుకున్న రీతిలో ఆదరణ దొరక్కపోవడం, నెలాఖరులో పెద్ద సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడంతో మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్…
సౌత్ ఇండియాలో కాస్తంత బొద్దుగా ఉండే హీరోయిన్లను జనం ఇష్టపడతారు కానీ బాలీవుడ్ లో అలా కుదరదు! సన్నగా నాజూకుగా ఉండాలి హీరోయిన్ అంటే!! అంతేకాదు… సైజ్ జీరో అయినా వాళ్ళకు ఓకేనే! అయితే… తమ ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్ భామలు చాలా కసరత్తులే చేస్తుంటారు. యోగాతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా సైజ్ కంట్రోల్ కు కారణమౌతుంది. ఇంతకూ బాలీవుడ్ బ్యూటీస్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏమిటో తెలుసుకోవాలని మీకుందా!? అయితే ఆలస్యమెందుకు… తెలుసుకుంటే…
1983లో భారత్ వరల్డ్ కప్ ను గెలుస్తుందని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ క్రికెట్ టీమ్ సుసాధ్యం చేసింది. అయితే… ఆ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో తెరకెక్కిన ’83’ సినిమా సునాయాసంగా విజయపథంతో సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా అవరోధాలను ఈ మూవీ ఎదుర్కోవాల్సి వచ్చింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించినా, స్వయంగా కపిల్ దేవ్ ఈ మూవీని…
‘క్వాహిష్, మర్డర్’ సినిమాలతో సెక్స్ సింబల్ ముద్ర వేయించుకుంది బాలీవుడ్ భామ మల్లికా షెరావత్. ఆమె వయసిప్పుడు 45 సంవత్సరాలు. కానీ అలా కనిపించనే కనిపించదు. అందుకు ఆమె రోజూ చేసే వర్కౌట్స్, యోగానే కారణం. అంతేకాదు… మితాహారం తీసుకోవడంతో పాటు మేని సొగసును కాపాడుకునే ఆహార పదార్థాలనే మల్లికా షెరావత్ ఎక్కడకు వెళ్ళినా స్వీకరిస్తుంది. కమల్ హాసన్ ‘దశావతారం’లోనూ నెగెటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించిన మల్లికా ఇటీవల ఓ వీకెండ్ గోవాలో గడిపేసింది. అక్కడ బికినీ…
కరోనా, ఓమిక్రాన్, డెల్టా వంటి వైరస్ ల కారణంగా పరిస్థితులు చాలా రాష్ట్రాలలో అదుపులో లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా చిత్రాల విడుదలను దర్శక నిర్మాతలు వాయిదా వేశారు. అయితే… ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్లలోనే మూవీని విడుదల చేస్తామని స్పష్టం చేసిన ‘విక్రాంత్ రోనా’ నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ సైతం ఇప్పుడు తమ సినిమా రిలీజ్…
అందాల భామ అదాశర్మకు కోపమొచ్చింది. రెండు రోజుల క్రితం బ్రిటీష్ గార్డ్ పక్కన ఆమె డాన్స్ చేసిన వీడియో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఆ వీడియో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. బ్రిటీష్ గార్డ్ పక్కన తన బాలీవుడ్ సాంగ్ ‘షేక్ ఇట్ లైక్ షమ్మీ’ పాటను అదాశర్మ పాడి, నర్తించింది. అయితే… ఆమె విదేశీ పర్యాటక ప్రవర్తన చాలా దారుణంగా ఉందంటూ నెటిజన్లు అదాశర్మపై విరుచుకుపడ్డారు. దాంతో…
హిట్టు కొట్టినోడు ఇరగదీస్తాడు అని సినిమా సామెత. పదేళ్ల క్రితం రిపబ్లిక్ డే రోజున విడుదలైన హృతిక్ రోషన్ మూవీ అగ్నిపథ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దాంతో అభిమానులు ఆ సంబరాన్ని తలచుకుంటూ హృతిక్ సోషల్ మీడియాలో అభినందనలతో సందడిచేశారు. అదేమన్నా సూపర్ డూపర్ హిట్టా అంటే అందేమీ కాదు. నిర్మాతకు మంచి లాభాలు చూపించిన చిత్రమే. బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసినదే. సినీ ట్రేడ్ పండిట్స్ సూపర్ హిట్ అని కితాబు కూడా ఇచ్చారు.…
వంద అన్న మాటకు ఉన్న విలువ ఏ పదానికి అంతగా కనిపించదు. సంస్కృతంలో శతం అన్నా, తెలుగులో నూరు అన్నా, అదే వందనే! సినిమా రంగంలో కూడా వందకున్న విలువ దేనికీ లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమా అంటే హిట్ మూవీగా లెక్కేసేవారు. ఆ తరువాత వంద కేంద్రాలలో శతదినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అన్నారు. ఆ పై వంద కోట్లు పోగేసిన సినిమాను సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. వాటికి…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఖిలాడీ’. కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 26 రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మూవీలోని ‘ఫుల్ కిక్కు… ‘ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ…