‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ సినిమాల విడుదల తేదీలను రీ షఫిల్ చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకుల చిత్రాల విడుదల తేదీలన్నీ మారిపోయాయి. ఇక ‘గని’ లాంటి సినిమా అయితే రెండు లేదా మూడు వారాల ముందు రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాస్ మహరాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదల విషయంలోనూ నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముందు అనుకున్నట్టు మార్చి 25వ తేదీ…
‘నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మేట్టయితే, దెయ్యం ఉందని నమ్మాల్సిందే’ అనేది ‘రాజ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున హిందీలో ‘రాజ్’ మూవీ విడుదలైంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన బిపాషా బసు కు ‘రాజ్’ మూవీ గట్టి పునాది వేసింది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి షూటింగ్ రోజుల్ని ఈ బెంగాలీ రసగుల్ల మరోసారి గుర్తు చేసుకుంది. అప్పటికి కేవలం రెండే సినిమాలు చేసిన…
దగ్గుబాటి హీరోలుగా పేరొందిన బాబాయ్-అబ్బాయ్ వెంకటేశ్, రానా తమ మకాం ను ముంబైకి మార్చారు. తెలుగువారయిన ఈ హీరోలు ముంబైలో ఎందుకు మకాం వేస్తున్నారనే డౌట్ రావచ్చు. కానీ, ఈ ఇద్దరు హీరోలు కలసి రానా నాయుడు అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ సీరీస్ షూటింగ్ కోసమే బాబాయ్-అబ్బాయ్ ఇద్దరూ ముంబైలో వాలిపోయారు. రానాయేమో కొత్త పెళ్లి కొడుకు కాబట్టి, తన భార్య మిహీకా బజాజ్ తో కనిపించారు. రానాతో…
ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదలచేయాలన్నది నిర్మాతలు కరణ్ జోహార్, పూరి, ఛార్మి ఆలోచన. ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకూ శ్రీకారం చుట్టారు. అయితే… ఈ సినిమా విడుదల కంటే ముందే పూరి జగన్నాథ్ – విజయ్ దేవకొండతో ‘జన గణ మన’ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీతో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్…
నేహాశెట్టి… ‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన…
ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి…
తమిళ హీరో శివకార్తికేయన్ కు రాజమౌళి అండ్ కో షాక్ ఇచ్చింది. శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ సినిమా పాండమిక్ సిట్యుయేషన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పడు పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో మార్చి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే డేట్ న తమ ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు రాజమౌళి అండ్ కో. నిజానికి జనవరి 7న విడుదల ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ వరుసగా అన్ని భాషల్లో ఈవెంట్స్ చేస్తూ…
కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు… ‘విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది, మహర్షి’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ‘అల్లరి’ నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా కొత్త చిత్రం సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.…
నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి కథలు వినిపిస్తున్న మేటి రచయిత ఎవరంటే ఇప్పట్లో విజయేంద్రప్రసాద్ పేరునే చెబుతారు జనం. తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన బాహుబలి సీరిస్ విజయేంద్రప్రసాద్ కలం నుండే చాలువారింది. ఆయన రచనలతో అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ విజయేంద్రప్రసాద్ రచనలు జనాన్ని మెప్పించాయి. విజయేంద్రప్రసాద్ రచనలతో తెరకెక్కే సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. విజయేంద్రప్రసాద్ పూర్తి పేరు కోడూరి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీని ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిన్న తెలిపింది. సరిగ్గా ఇప్పుడు అదే బాటలో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా నిర్మాతలూ నడువ బోతున్నారు. నిజానికి ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు పలు చిత్రాల విడుదల తేదీలలో జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని రెండు…