‘క్వాహిష్, మర్డర్’ సినిమాలతో సెక్స్ సింబల్ ముద్ర వేయించుకుంది బాలీవుడ్ భామ మల్లికా షెరావత్. ఆమె వయసిప్పుడు 45 సంవత్సరాలు. కానీ అలా కనిపించనే కనిపించదు. అందుకు ఆమె రోజూ చేసే వర్కౌట్స్, యోగానే కారణం. అంతేకాదు… మితాహారం తీసుకోవడంతో పాటు మేని సొగసును కాపాడుకునే ఆహార పదార్థాలనే మల్లికా షెరావత్ ఎక్కడకు వెళ్ళినా స్వీకరిస్తుంది. కమల్ హాసన్ ‘దశావతారం’లోనూ నెగెటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించిన మల్లికా ఇటీవల ఓ వీకెండ్ గోవాలో గడిపేసింది. అక్కడ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జాస్మిన్ గ్రీన్ టీ రుచి చూస్తూ, వీడియోలు చేసింది.
బీచ్ ఒడ్డున బేర్ పుట్ లో వయ్యారంగా నడుస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. వీటన్నింటినీ తీసుకొచ్చి, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే… ఈ అమ్మడు కేవలం అందాల ఆరబోతకే సోషల్ మీడియాను వాడుకుంటుందనే అభిప్రాయానికి తొందరపడి రాకండి! జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా తన ఫ్యాన్స్ అందరికీ సంప్రదాయ దుస్తులు ధరించి మల్లికా షెరావత్ శుభాకాంక్షలు కూడా తెలిపింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న మల్లికా షెరావత్ చివరగా ఈషా గుప్తాతో కలిసి ఎమ్.ఎక్స్ ప్లేయర్ లో ‘నకాబ్’ సీరిస్ లో దర్శనమిచ్చింది.
https://www.instagram.com/p/CZGm04SJ6ym/